calender_icon.png 3 January, 2026 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ భద్రత నియామలను తప్పక పాటించాలి

02-01-2026 12:00:00 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, జనవరి 1 (విజయక్రాంతి): ఈ నెలలో జరిగే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన పోస్టర్ ని గురువారం తన ఛాంబర్ లో కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 01.01.2026 నుండి 31.01.2026 వరకు అన్ని పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు.

ప్రతి రోజు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులచే రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించాలన్నారు.ఎంఈఓసు, సి హెచ్ ఎం ఎస్ మరియు సిఆర్పిఎస్ వారి పాఠశాల సందర్శనలో ఈ ప్రత్యేక కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన. ఈ కార్యక్రమాల డిజిటల్ డాక్యుమెంటేషన్ ను రూపొందించి వాట్సాప్ ద్వారా జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు.

రోడ్ ప్రమాదాలను నివారించెందుకు నిబంధనల విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డైవ్రింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు భద్రత నిబంధనలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.