10-08-2025 06:30:07 PM
ఎల్ఐసి ఏజెంట్ల సంఘ నూతన భవనం ప్రారంభం
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఎల్ఐసి ఏజెంట్లను ప్రతి ఒక్క ఏజెంటు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు రాజయ్య పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని మంజులపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంఘ భవనాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోళ్ల మురళీధర్ రెడ్డి, ఆల్ ఇండియా క్లియ అధ్యక్షులు విట్టల్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం బ్రాంచ్ కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రెండవసారి కూడా ఏకగ్రీవంగా నారాయణ, భాస్కర్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా, క్యాషియర్ గా వినోద్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... డివిజన్లోనే నిర్మల్ బ్రాంచ్ ఏజెంట్లు ఐక్యంగా ఉండి ఒక సొంత భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఏజెంట్ సమస్యలపై ఎప్పటికప్పుడు తాము డివిజన్ సెంట్రల్ నాయకులతో మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం ఏజెండ్ల సంఘ భవనం దాతలను శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా డివిజన్లోని అన్ని బ్రాంచుల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నారాయణతో పాటు ప్రధాన కార్యదర్శి భాస్కర్ ను డివిజన్ నాయకులతోపాటు నిర్మల్ బ్రాంచ్ నాయకులు కూడా సన్మానించారు.