calender_icon.png 10 August, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండాపూర్ మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

10-08-2025 07:13:34 PM

కొండాపూర్:   కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున ఈ అంతరాయం కలుగుతుందని ఏడీ వీరారెడ్డి, ఏఈ సిద్దిరాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.