20-07-2025 12:02:04 AM
సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రుల హాజరు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్(ఏకే సింగ్) రాజ్‌భవన్‌లో శనివారం ప్రమాణస్వీకారం చే శారు. కొత్త సీజేతో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్ర మాణం చేయించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పా టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
చీఫ్ జస్టిస్‌ను గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అభినం దించారు. హైకోర్టు ఏర్పాటైన తర్వాత జస్టి స్ సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. త్రిపుర హైకోర్టు సీజే గా పనిచేస్తూ ఆయన బదిలీపై రాష్ట్రానికి వచ్చా రు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుజయ్‌పాల్.. కోల్‌కతాకు బదిలీ అయ్యారు.
త్రిపుర నుంచి తెలంగాణకు..
జస్టిస్ ఏకే సింగ్ 1965 జూలై 7న జన్మించా రు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1990 వరకు యూపీ హైకోర్టులో న్యాయవాదిగా, 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేశారు. 2012 జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యా రు.
2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ర్ట న్యా య సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. 2022 వరకు జార్ఖండ్ హైకో ర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్య త వహించారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. త్రిపుర నుంచి రాష్ట్రానికి హైకోర్టుకు సీజేగా వచ్చారు.