calender_icon.png 21 July, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ కాంగ్రెస్‌కు మరో పీజేఆర్‌ని అవుతా

20-07-2025 12:00:00 AM

కార్పొరేషన్ చైర్మన్‌గా ఏడాది పూర్తి.. 

37మంది కార్పొరేషన్ చైర్మన్లలో అతి చిన్నవాడిగా గుర్తింపు  

  1. కార్యకర్తలను నాయకులుగా చేసిన నేత సీఎం రేవంత్‌రెడ్డి 
  2. సాధారణ కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్‌గా ఎదిగిన
  3. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్‌లోనే పయనం 
  4. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటా 
  5. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, (విజయక్రాంతి): మెట్టు సాయికుమార్.. గోషామహల్ నియోజకవర్గంలోని సీతారాంబాగ్‌లో ఆటోకూడా దూర ని బస్తీ నుంచి వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి నుంచి క్రమశిక్షణను అలవర్చుకున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివినా.. సాధారణ కార్యకర్తగానే కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్‌నే నమ్ముకుని ముందుకుసాగారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను తెలంగాణ ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఎంతోమంది మహామహులున్నా నాలుగు పదుల వయస్సు దాటని సాయికుమార్‌కు ముఖ్యమంత్రి గురుతర బాధ్యతలు అప్పగించగా, విజయవంతంగా ఏడాది పూర్తిచేసు కున్నారు.

2007లో ఆసీఫ్‌నగర్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా రాజకీయ జీవితం మొదలైంది. నాటి నుంచి నేటివరకు పలు పదవులలో కొనసాగా రు. 2011, 2015లో నాంపల్లి అసెం బ్లీ యూత్ ప్రెసిడెంట్‌గా, 2017లో పీసీసీ కార్యదర్శిగా, 2020 ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని వీడలేదు. 17 ఏండ్లపాటు పార్టీనే నమ్ముకుని, కార్యక ర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపే తానికి కృషి చేశారు. ఆపదలో ఉన్న కార్యకర్తలు.. అన్నా అని పిలిస్తే సహాయపడే ఆయన ఏనాడు తాను చేసిన సాయాన్ని ప్రచారం చేసుకునేందుకు ఇష్టపడలేదు.

అవాంతరాలు ఎదురైనా..?

కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాయికుమార్ ఏనాడూ నిరుత్సాహపడలేదు. తాను నమ్ముకున్న కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ ప్రాభవం కోల్పోయింది. ఎంతోమంది సీనియర్లు పార్టీలు మారినా సాయికుమార్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. గాంధీభవన్‌లో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరుకావడంతోపాటు పార్టీ ఆదేశాలను శిరసావహించారు. ఏనాటికైనా కష్టానికి ఫలితం ఉంటుందని నమ్మారు. ఆ నమ్మకమే తనను చిన్న వయస్సులోనే కార్పొరేషన్‌కు చైర్మన్ పదవి కట్టబెట్టింది.

మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు..

రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచి మత్స్యకారులు ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు  నేను నాదైన శైలిలో పనిచేస్తున్నాను. గత ఏడాది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నక్లెస్‌రోడ్‌లో అంబేద్కర్ గ్రౌండ్ వద్ద ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి పలువురు మత్సకారులకు ప్రముఖుల చేతులమీదుగా ఉత్తమ సేవా పత్రాలను అందజేశాను.

ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సహాయం అందజేత

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొన్న తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని హాస్పటల్‌కు తీసుకెళ్లి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. 

‘విజయక్రాంతి’తో మెట్టు సాయికుమార్ మాటామంతి

విజయక్రాంతి: చిన్నవయస్సులోనే పేరున్న కార్పొరేషన్‌కు చైర్మన్ అయ్యారు. ఎలా ఫీలవుతున్నారు?

మెట్టు సాయికుమార్: నేను ఇవ్వాళ తెలంగాణ ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్‌గా నియమితుడిని అయ్యానంటే అంతా సీఎం రేవంత్ రెడ్డి చలవతోనే. రేవంత్ అంటే భరోసా. కార్యకర్తను నాయకున్ని చేసే ఓ ఫ్యాక్టరీ. ఆయన పాలనలో తెలంగాణ వేగంగా అ భివద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఆయన ఆదేశాలు నాకు శిరోధార్యం. ఏ పని అప్పగించినా క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా, నాయకు నిగా పనిచేస్తా. సీఎంకు రుణపడి ఉంటా.

విజయక్రాంతి: కార్పొరేషన్ చైర్మన్ అవుతారని ఊహించారా?

మెట్టు సాయికుమార్: నేను ఏనాడు పదవులు ఆశించి పనులు చేయ లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ర్ట కాంగ్రెస్ నాయకత్వం ఏ బాధ్యతలు అప్పగించినా క్రమశిక్షణతో పూర్తి చేశాను. నా వ్యక్తిత్వాన్ని గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి నాపై గురుతరమైన బాధ్యతలు పెట్టారు. కార్పొరేషన్‌ను అభివద్ధి బాటలో నడిపిస్తా. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూస్తా. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తా.

విజయక్రాంతి: ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందా..?

మెట్టు సాయికుమార్: నేను ఏనాడు పదవుల కోసం ఆశపడలేదు. కాంగ్రెస్ పార్టీ నా సేవలు ఎన్నికలలో అవసరమని భావించి ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తా. అన్ని వర్గాలను కలుపుకొనిపోయి హైదరాబాద్ కాంగ్రెస్‌కు మరో పీజేఆర్ కావాలనేదే నా తపన. తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటా. రాబోయే రోజుల్లో గోషామహల్ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురవేస్తాం.

విజయక్రాంతి: పార్టీలో సీనియర్లతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి..?

మెట్టు సాయికుమార్: కాంగ్రెస్ పార్టీలో సీనియర్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకు పదవి రావడంలో అందరి ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షలు మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డికి నా కృతజ్ఞత లు. నాకు పదవి రావడంలో వారి పాత్ర మర చిపోలేను. అయితే నన్ను రాజకీయంగా పాస్ చేసింది మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా.