21-07-2025 06:17:16 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న, సదానందం జన్మదిన వేడుకలు సోమవారం కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంబాల రాజు మాట్లాడుతూ, స్వప్న సదానందం కాంగ్రెస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుకొని ప్రజాప్రతినిధిగా సేవలందించారని, నేడు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవా దృక్పథం ఉన్న నేతలకు మరిన్ని పదవులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు బిజిగిరి శ్రీకాంత్, ఉప్పల సాంబశివరెడ్డి, ల్యాదల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.