21-07-2025 06:20:05 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణ పరిధిలో శ్రీ ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుచేసి 14 ఏళ్ళు పూర్తి చేసుకుని 15వ ఏటా అడుగుపెడుతున్న నేపథ్యంలో గ్రూపు సభ్యులకు సోమవారం వెండి నాణాలను అందించారు. 108 మంది సభ్యులతో 2011లో ఏర్పడ్డ ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంఘ సభ్యుల సంఖ్య 500కు చేరింది. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తేరాల శ్రీనివాస్, రావుల మురళి, మంచన శ్రీనివాస్, తాజుద్దీన్, తేరాల శ్యామ్, వెలిశాల కమల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.