21-07-2025 05:47:11 PM
హనుమకొండ (విజయక్రాంతి): హన్మకొండ మడికొండ హైదరాబాద్ హైవేలో గల ఆదిత్య నూతన సిఎన్జి గ్యాస్ స్టేషన్(CNG Gas Station) సోమవారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల, పౌర సంబంధాల శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి పథంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తుందని ప్రజా పాలన చేస్తున్నామన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కావలసిన నిధులను మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.