calender_icon.png 21 July, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో రెండు రోజులపాటు శిక్షణ తరగతులు

21-07-2025 06:04:29 PM

వరంగల్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ తో పాటు ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సంస్థాగత నిర్మాణంలో భాగంగా నగరంలోని బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ(Vaagdevi Engineering College)లో ఈనెల 30, 31న రెండు రోజుల పాటు ప్రశిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మండల కేంద్రాలలో రాజకీయ చైతన్య పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు సైనికుల్లా పనిచేయాలని అందుకు అందుకు ప్రశిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు గౌతం రావు, శేఖర్, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.