20-07-2025 12:00:00 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్ జూలై 19 (విజయక్రాంతి): హైదరాబాద్ దేశంలోనే కాదు, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరమని, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫేజ్ మెట్రోను రెండు కేటగిరీలుగా విస్తృత ప్రణాళికతో రూపొందించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శని వారం హైదరాబాద్ పార్క్ హయత్‌హోటల్‌లో మంత్రి కోమటి రెడ్డి ఆధ్వర్యంలో మెట్రో రెండో దశ అంశంపై రాష్ట్ర ప్రభు త్వం, మెట్రో రైల్ సంస్థ అవగా హన సదస్సును ఏర్పాటు చేశా రు.
ఈ సదస్సుకు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రె స్, బీజేపీ ఎంపీలు హాజరయ్యా రు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైల్ కారిడార్ నిర్మాణంలో భాగం గా ఏ క్యాటగిరీలో 5 కారిడార్లు, 76.4 కి.మీ, బీ కేటగిరిలో 3 కారిడార్లు, 86.1 కి.మీ మొత్తం 162.5 కి.మీ రెండో దశ మెట్రో దశ భవిష్యత్ ట్రాఫిక్‌కు గణనీ యమైన పరిష్కారంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీలు సురేశ్‌షె ట్కార్, మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురామరెడ్డి, పోరిక బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్... బీజేపీ ఎంపీలు ఈటల రాజేం దర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్‌రావు పాల్గొన్నారు.