19-08-2025 06:40:34 PM
ఈనెల 20న ప్రమాణ స్వీకారోత్సవం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ , విశ్వకర్మ సంఘం నూతన కమిటీని మంగళవారం స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీ రామోజీ లక్ష్మణాచారిలను ఎన్నుకున్నారు. వీరి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులను ఖరారు చేశారు.
ఈనెల 20న సాయంత్రం నాలుగు గంటలకు పట్టణంలోని హనుమాన్ మందిర్ లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ సభకు నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బెల్లంపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ మడుపు రవికుమార్ కోరారు.