calender_icon.png 19 August, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హల్ది ప్రాజెక్టును సందర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

19-08-2025 06:38:16 PM

గంగమ్మకు ప్రత్యేక పూజలు

వెల్దుర్తి,(విజయక్రాంతి): మెదక్ జిల్లా ఉమ్మడి వెల్దుర్తి మండల పరిధిలోని హల్దీ ప్రాజెక్టును  మంగళవారం నర్సాపూర్  ఎమ్మెల్యే  సందర్శించారు. ప్రాజెక్టు వరద ఉధృతిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సూచించి అప్రమత్తంగా ఉండాలన్నారు. తరువాత హల్ది ప్రాజెక్టులో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట బి ఆర్ ఎస్  నాయకులు,  రైతులు, తదితరులు ఉన్నారు.