calender_icon.png 1 May, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనియన్ బ్యాంక్ నూతన రీజినల్ హెడ్‌గా శ్రీనివాస్

01-05-2025 12:00:00 AM

కొండపాక, ఏప్రిల్ 30 : యూనియన్ బ్యాంక్ సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ నాలుగు జిల్లాల నూతన రీజనల్ హెడ్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

జిల్లాలోని ప్రభుత్వ పథకాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు, రాజీవ్  యువ వికాసం, మహిళా శక్తి, రైతు భరోసా, ఎస్ హె జి యూనియన్ బ్యాంకులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపారు. ఇంతకుముందు రీజనల్ హెడ్ గా పనిచేసిన వికాస్ బదిలీపై ముంబాయికి వెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం హరిబాబు, యూనియన్ బ్యాంకు డివైఆర్‌ఎం రాఘవ పాల్గొన్నారు.