03-11-2025 02:20:01 AM
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి సంస్థ(డబ్ల్యూటీఐటీసీ)కు 2026 సంవత్సరానికి కొత్త నాయకత్వం త్వరలో ఎంపిక కానుంది. ఇందు కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగియనుండటంతో నూతన అంతర్జాతీయ కమి టీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త బృందం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నోక్రాట్లకు ప్రాతినిథ్యం వహించనుంది.
కొత్తగా ఎం పికయ్యే ఇంటర్నేషనల్ చాప్టర్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తమ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 2025 డిసెంబర్‌లో దుబాయ్, యూఏఈలో జరగనున్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక సదస్సు సందర్భంగా నిర్వహించనున్నారు. డబ్ల్యూటీఐటీసీ నూతన కమిటీ ఎంపిక కోసం నవంబర్ 15వ తేదీన వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని డ బ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కు మార్ మక్తాలా పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను తమ అధికారిక వెబ్‌సైట్ <www. wtitc.org>లో పంపాలని, మరి న్ని వివరాలకు +91 81231 234 34(భారతదేశం), +971 56577 8923(యూఏఈ) నెంబర్లను సంప్రదించాలని కోరారు.