16 April, 2026 | 11:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కూరగాయల దోపిడీని అరికట్టండి

17-02-2026 12:52 AM

మణుగూరు, ఫిబ్రవరి16 (విజయక్రాంతి) :  మున్సిపాలీటీ పరిధిలోని కూరగాయ దుకాణాల వ్యాపారులు అధిక ధరలతో ప్రజలను జలగల దోసుకుంటున్నారని, సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయ  దుకాణాలలో వ్యాపారుల  దోపిడీని అరికట్టి, సామాన్య ప్రజలకు ధరలను  అందుబాటులో ఉంచాలని ఆయన  మున్సిప ల్ కమిషనర్  ప్రసాదుకు సోమవారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలో  కొందరు దుకాణదారులు, కూరగాయల  వ్యాపారస్తులు అధిక ధరలతో సామాన్య ప్రజలను దోచుకు తింటున్నారని  ఆరోపించారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిన చర్యలు తీసుకుంటామంటూ  ఒక్క సారి కూడా షాప్ లను తనిఖీ చేయకుండా అందించే ముడుపుల  మత్తులో జోగుతున్నారని, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే అధికారులు వ్యాపారస్తుల ఆర్థిక దోపిడీని నిలువరించాలని, ధరల నియంత్రణ చట్టం  అమలుపరచా లని, వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలను ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రతి దుకాణంలో ధరల పట్టికను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిచో  హైకోర్టును ఆశ్రయించి , ప్రజాప్రయోజనాల కోసం వ్యాజ్యం దాఖలు చేస్తానని పేర్కొన్నారు.