calender_icon.png 22 August, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వ హంగులతో నూతన ఎన్‌సీఏ

30-09-2024 12:00:00 AM

బెంగళూరు: సర్వ హంగులతో కొత్త జాతీయ క్రికె ట్ అకాడమీ (ఎన్‌సీఏ)ని బీసీసీఐ బెంగళూరులో ప్రారంభించింది. ఎన్నో అంతర్జాతీయ స్థాయి హం గులతో దీనిని నిర్మించడం విశేషం. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 40 ఎకరాల ప్రాంగణంలో దీనిని నిర్మించారు.

ఈ అకాడమీలో మూడు ప్రపంచస్థాయి మైదానాలు, ఇండోర్, అవుట్‌డోర్ సహా మొత్తం 86 పిచ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా 45 అవుట్‌డోర్ ప్రాక్టీస్ పిచ్‌లను కూడా నిర్మించారు. ఈ అకాడమీలో అతిపెద్ద జిమ్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఒక ఎన్‌సీఏ ఉన్న విషయం తెలిసిందే. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన డ్రెస్సింగ్ రూం ఇందులో ఉంది.