22-12-2025 10:19:17 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లోని గ్రామ పంచాయతీలతో పాటు ఖానాపూర్ నియోజక వర్గంలోని జన్నారం మండలంలోని గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఆయా జీపీల్లో సోమ వారం ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షెట్టిపేట, దండేపల్లి, హజీపూర్ మండలాల్లోని వెంకట్రావుపేట్, దండేపల్లి, రాపల్లి గ్రామాల్లో నూతన ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, పాలక వర్గ ప్రమాణస్వీకరణ మహోత్సవం కార్యక్రమాల్లో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పాలకవర్గం సభ్యులందరూ కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి సూచించారు.