calender_icon.png 13 January, 2026 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడప గడపకు మన సర్పంచ్

13-01-2026 08:53:32 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): 2026 కొత్త సంవత్సరం నుంచి ప్రతి మంగళవారం “గడప గడపకు మన సర్పంచ్” అనే నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా సర్పంచ్ బనోత్ నరేష్ నాయక్. కేవలం ఓట్ల సమయంలోనే కాదు, నిరంతరం ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుంది. ముఖ్యంగా గ్రామ ప్రజల ఆరోగ్య సంబంధిత సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.