29-12-2025 11:25:57 PM
గ్రామాలకు వరం: సర్పంచ్ పబ్బు సతీష్
హనుమకొండ, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న వికసిత్ భారత్ జీ రాం జీ 2025 పథకం గ్రామీణాభివృద్ధికి కీలకంగా నిలవనుందని కమ లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆర్థికంగా గ్రామాలు బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
గతంలో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకంలో ఉన్న విధానపరమైన లోపాలను సవరించి వాటికి పరిష్కారంగా జీ రాం జీ 2025 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమన్నారు.ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో వంద పని దినాలకే పరిమితమైన అవకాశాన్ని నూతన పథకం ద్వారా 125 ప ని దినాలుగా పెంచడంతో పాటు వేతనాలను కూడా పెంచడం గ్రామీణ కార్మికులకు ఎంతో ఊరటనిస్తుందన్నారు. గ్రామాలకు సమగ్ర అభివృద్ధి జరిగే అవకాశముందని ప్రజలకు నేరుగా మేలు చేకూరుతుందని సర్పంచ్ పబ్బు సతీష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, నాయకులు మార్క అశోక్, కీర్తిన తదితరులు పాల్గొన్నారు.