calender_icon.png 29 December, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

29-12-2025 08:15:48 PM

హద్దు మిరితే చర్యలు తప్పవు

మరిపెడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వీరభద్ర రావు

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ఎస్ఐ వీరభద్ర రావు న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అనంతరం మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల రక్షణ ముఖ్యమైనది అని 29.12.2025 నాడు కొన్ని నిబంధనలను జారీ చేశారు. ముఖ్యంగా హైవేల పైన, రోడ్ల పైన కేక్ కటింగ్ చేయరాదు. హోటల్స్, రెస్టారంట్స్ వారు సమయపాలన పాటించాలి.

ఈవెంట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత పదార్థాల వినియోగం జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది , డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు మరియు జైలు శిక్ష తప్పదు. నగరం అంతటా ప్రత్యేక తనిఖీ బృందాలు ఉంటాయి, ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, అతివేగం, సైలెన్సర్ శబ్దాలతో ఇబ్బంది కలిగించే వాహనాలను సీజ్ చేస్తాం.

వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ (షీ టీం) నిఘా ఉంటుంది, అత్యవసర సమయంలో ఏదైనా సాయం కోసం వెంటనే డైల్ 100 లేదా 112కి కాల్ చేయండి. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వేడుకలుజరుపుకోవాలని, ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.