29-12-2025 08:24:07 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీల నిర్వహణ కొరకు అటవీ శాఖ వారిచే మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓ కలిందిని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నీలగిరి దివ్యదర్శన రావు, అటవీ శాఖ అధికారి మంగీలాల్, ఎంపీ ఓ సమ్మిరెడ్డి పలువురు ఉన్నారు.