02-01-2026 12:00:00 AM
కార్యకర్తల ఏళ్ల కల సహకారమైన వేళ
ఇది.. ఇందిరమ్మ భవన్ విజయోత్సవమే ..
పదేళ్ల తర్వాత పార్టీ కార్యాలయం హస్తగతం
నూతన సంవత్సర నుండి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకలాపాలు ఆరంభం
కంచుకోటలో కాంగ్రెస్ పూర్వ వైభవం దిశగా అడుగులు
మణుగూరు, జనవరి1, (విజయక్రాంతి ) : పినపాక నియోజకవర్గంలో కొత్త సంవత్సరానికి ముందే కాంగ్రెస్ శ్రేణులలో సరికొత్త జోష్ మొదలైంది. పదేళ్ల అనంతరం కాంగ్రె స్ కార్యకర్తల రెక్కల కష్టానికిఫలితం లభించింది. గత బిఆర్‌ఎస్ నాయకుల చెర నుండి విడిపించిన,ఇందిరమ్మ భవన్ కాంగ్రెస్ పా ర్టీకి కంచుకోటగా మారుతుంది. పార్టీ కార్యాలయం తిరిగి కాంగ్రెస్ కార్యాలయంగా మా రడంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనయా జోష్ నెలకొంది.గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ కార్యకర్తలలో నూతన ఉత్సాహం, ఉత్తేజం కనబడుతుంది. దీంతో పినపాక నియోజకవర్గంలో కంచుకోటలో కాంగ్రెస్ పూర్వ వైభ వం దిశగా అడుగులు వేస్తుంది. రంగురంగుల హంగులతో నూతన కళను సంతరిం చుకొని, కాంగ్రెస్ కార్యకర్తల కోలాహాలంతో ఇందిరమ్మ భవన్‌సందడిగా మారింది. దీనిపై విజయక్రాంతి కథనం..
కార్యకర్తలలో జోష్..
పదేళ్ల తర్వాత ఇందిరమ్మ భవన్ లో హస్తం పార్టీ పాగా వేసింది. గత నవంబర్ 2న అప్పటి వరకు ఉన్న బీఆర్‌ఎస్ భవన్ గా ఉన్న కార్యాలయాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మూకు మ్మడిగా ముట్టడించారు. గత ఎమ్మెల్యే కాంతారావు కార్యకర్తల కష్టంతో గెలిచి, అవకాశాల కోసం పార్టీని విడి బీఆర్‌ఎస్ లో చేరారని, పార్టీ కార్యాలయమైన ఇంది రాభవన్ ఆక్రమించుకొని, తెలంగాణ భవన్ మార్చారని కాంగ్రెస్ కార్యకర్తలు అది నుండి వాదిస్తున్నారు. గత పదిఏళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉండ డం, కాంతారావు ఎమ్మెల్యేగా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉండిపోయారు. ఎన్నికల సమయంలో రేవంత్ రె డ్డి సైతం కాంగ్రెస్ అధికారంలో కి వస్తే పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని బహిరంగంగా ప్రకటిం చారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి పాయం వెంకటేశ్వర్లు గెలుపొందడం, పార్టీ అధికారంలోకి రావడంతో సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత నవంబర్ 2న వివాదాస్పదంగా మారిన పార్టీ కా ర్యాలయం పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు తమ ఆధీ నంలోకి తీసుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేశారు.
పదేళ్ల తర్వాత పార్టీ కార్యాలయం హస్తగతం..
ఇందిరమ్మ భవన్ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు, ఘర్షణ వాతావరణంనెలకొన్న విషయం తెలిసిందే. కార్యాలయ స్వాధీనంపై రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో 144 సెక్షన్ విధించారు. అయితే ప్రస్తుతం అన్ని అడ్డంకు లను అధిగమించి, కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్యకర్తలు ఈ కార్యాలయాన్ని పూర్తి గా హస్తగతం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా కార్యాలయా నికి నూతన హంగులను అద్దుతున్నారు.
10 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ భవన్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు నిలయంగా మారనుంది. ఓ వైపు ఇప్ప టి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్ర మించుకున్నారన్న అపవాదును మూట కట్టుకున్న మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఓ అడుగు వెనకవేసి, తమ పార్టీ కార్యకర్తల కోసం నూతన కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలపడంతోఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది.
కాంగ్రెస్ కార్యకర్తలలో సరికొత్త సంబరం..
కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టం గెలిచిందని, నూతన సంవత్సరం నుండి తమ కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలకు నిలయంగా మారడంతో పార్టీ కార్యకర్తల్లోఆ నందం, ఉత్సాహం ఉరకలేస్తోంది. కార్యక ర్తలు, నాయకులు కొత్త ఉత్సాహంతో మునిగితేలుతున్నారు.తిరిగి తమ కార్యాలయం స్వాధీనం కావడంతో నూతన సంవత్సరం నుండి పార్టీ కార్యక్రమాలు ఊపొందుకోనున్నాయి.
పార్టీ కార్యాలయం స్వాధీనం కార్యకర్తల విజయం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంను బీఆర్‌ఎస్ చెర నుండి తిరిగి స్వాధీనం చేసు కోవడం, ఇందిరమ్మ భవన్ గా పార్టీ కా ర్యాలయాన్ని నిలపడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి విజయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకు కృషి ఫలితమే ఈ విజయోత్సమన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్
కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తె కెరటాలు పోరాడే సైనికులు
కార్యకర్తల రెక్కల కష్టంతో నిర్మించిన భవన్ ను నిన్నటి వరకు బీఆర్‌ఎస్ దౌర్జన్యాలు ఆక్రమించారని, అక్రమాలకు చరమగీతం పాడుతు, పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలుగా నిలిశారని,బీఆర్‌ఎస్ అక్రమాలకు తగిన గుణ పాఠం చెప్పారన్నారు.
కూరం రవి, యూత్ కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు