మొక్కలు నాటిన నూతన వధూవరులు
06-05-2024 02:15 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి) : జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నూతన వధూవరులు గాడ్గే సతీష్, వైష్టవి ఆదివారం మొక్కలు నాటారు. ముఖరా సర్పంచ్ గాడ్గే మీనాక్షి కుమారుడు గాడ్గే ధీరాజ్‌ల వివాహ వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు నూతన వధూవరులతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటి వరకు ముఖరా గ్రామంలో ప్రతి వేడకలోనూ మొక్కలు నాటుతున్నామని, నేటి వరకు గ్రామంలో 1,05624 మొక్కలు నాటి 100శాతం రక్షించామని సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో సంతోష్‌కుమార్ హరిత సంకల్పాన్ని కొనసాగిస్తూనే ఉంటామన్నారు.




