31-12-2025 12:00:00 AM
ముషీరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): మహర్షి దయానంద సరస్వతి జన్మద్వి శతాబ్ది, స్వామి శ్రద్ధానంద సరస్వతి బలిదాన శతాబ్ది, ఆర్య సమాజ స్థాపన సార్థ శతాబ్ది సందర్భంగా జనవరి 14న ’సనాతన జాగరణ, దేశ కల్యాణ యజ్ఞయాత్ర’ను చేపట్టనున్నట్టు నిర్వాహకులు ఆచార్య తేజస్సు తెలిపారు.
తమిళనాడులోని రామేశ్వరం ఆలయం నుంచి ప్రారంభమై ఈ యాత్ర16 రాష్ట్రాల మీదుగా 9,600 కిలోమీటర్ల పైగా ప్రయాణించి ఫిబ్రవరి 26న జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేంద్ర ఆర్య, డాక్టర్ ధర్మ తేజలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ యాత్రలో భాగం గా 100కు పైగా ప్రదేశాలలో వేదా అధ్యయనం, యజ్ఞ యాగాదులు, గో సేవ, గోపా లన వంటి అంశాలపై ప్రవచనాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఆయా ప్రాంతీ య భాషలలో సాహిత్యాన్ని పంపిణీ చేయ డం ద్వారా సనాతన ధర్మ ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. యాత్రకు ముం దు జనవరి 3న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గండిపేట సిబిఐటి ఖానాపూర్ లోనీ వేద గురుకులం అగ్నిపురం వద్ద అఖం డ జ్యోతి(అరణి మంథన) వెలిగిస్తామని పేర్కొన్నారు. ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి విశిష్ట ఆహ్వానితులుగా పూజ ఆచార్య ప్రద్యుమ్న(హర్యానా), సమతా మూర్తి విగ్ర హ ప్రతిష్టాపకులు శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి, పద్మశ్రీ ఆచార్య సుకామా హాజరవుతారని ఆచార్య తేజస్సు తెలిపారు.