01-08-2025 01:28:46 AM
ఖైరతాబాద్;జూలై 31 (విజయ క్రాంతి) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) హాస్పిటల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందిన పలువురు వైద్యులు సిహెచ్ రామ్ రెడ్డి (సీనియర్ ప్రొఫెసర్- యూరాలజీ), నసీమ్ భాను (సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్), వలియబీ షేక్ (సీనియర్ ఎ ఎన్ ఎమ్) లను హాస్పిటల్ డైరెక్టర్ నగరి బీరప్ప ఘనంగా సత్కరించారు.
ఇన్ని సంవత్సరాలు ఎంతో బాధ్యతాయుతంగా హాస్పిటల్‌కి వారు అందిం చిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ ప్రో. శాంతివీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు దయాకర్, సుజాత, జ్యోతి, శైలజ, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్య గౌడ్, శ్రీనివాసులు, భరత్ భూషణ్, మార్తా రమేష్, శాంతి పాల్గొన్నారు.