23-07-2025 12:00:54 AM
- 6 నెలల్లో 100 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు
- నిమ్స్ వైద్యుల అరుదైన ఘనత
- ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత సర్జరీలు
- డాక్టర్లపై ప్రశంసల జల్లు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కేవలం 6 నెలల్లో 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి నిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఒక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ స్థాయిలో ట్రా న్స్‌ప్లాంటేషన్లు చేయడం చాలా గొప్ప విషయమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆ యన నిమ్స్ యురాలజీ విభాగానికి చెందిన వైద్యులను అభినందించారు.
నిమ్స్‌లో 19 89లో యురాలజీ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడికి అత్యు త్తమ కేంద్రంగా మారింది. సీనియర్ ప్రొఫెసర్ హెచ్‌ఓడీ డా.సి.రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవ్‌రాజ్, యూరాలజీ బృందం గత పదేళ్లలో వెయ్యికి పైగా కిడ్నీ మార్పిడి శ స్త్రచికిత్సలను నిర్వహించారు. ఏటా 100కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని డా.సి.రామ్‌రెడ్డి తెలిపా రు. రెండేళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు కేవలం 6నెలల్లో 100 మా ర్కును దాటడమనేది నిమ్స్ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోతుందన్నారు.
రోబోటిక్ సర్జరీలతో..
దేశంలో అత్యధిక ట్రాన్స్‌ప్లాం ట్లు జరిగే టాప్ త్రీ ఇన్‌స్టిట్యూట్‌లలో నిమ్స్ ఒకటి అని డా. సి రామ్‌రెడ్డి వెల్లడించారు. రోబోటిక్ వ్యవస్థ వల్ల సాంకేతిక పురోగతిలో ముందంజలో ఉండటానికి వీలు పడిందన్నారు. ఇప్పటివరకు 4 రోబోటిక్ మూత్ర పిండ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఏడాదికి 12వేలకు పైగా కిడ్నీ చికిత్సలు కూడా నిర్వహించా మని తెలిపారు. గత రెండేళ్లలో 350 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారని డా.రాహుల్ దేవరాజ్ అన్నారు. ఈ శస్త్రచికిత్సలన్నీ రాష్ర్ట ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగానే చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ, సీఎం రేవంత్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.