calender_icon.png 23 July, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు అత్యంత భారీ వర్షాలు

23-07-2025 12:00:00 AM

  1. వాతావరణ శాఖ అంచనా
  2. రెడ్ అలర్ట్ జారీ
  3. 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు
  4. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 26 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు ఈ సీజన్‌లో తొలిసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉదయం 8:30 గంటల వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షా లు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేయగా... రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని వెల్లడించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం మధ్యా హ్నం నుంచి గురువారం ఉద యం 8:30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. జులై 24, 26 తేదీల్లో రాష్ర్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. గత రెండు మూడు రోజులుగా ఉదయం వేళల్లో ఎండగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి, కుండపోత వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఉద యం ఎండ తీవ్రత అధికంగా ఉండగా, సాయంత్రానికి నల్లని మేఘాలు దట్టంగా అలుముకుని ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది.

ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, అంబర్‌పేట్, తార్నాక, ఉప్ప ల్, చాదర్‌ఘాట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, నల్లకుంట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షం కురిసిం ది. ప్రధాన రహదారులు, లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.