23-07-2025 05:48:23 PM
ఎమ్మార్పీఎస్ డిమాండ్..
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం సురేష్ మాట్లాడుతూ... మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో చేయాల్సిన ఆన్లైన్ పనులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పాసు బుక్కులు ఆన్లైన్లోకి ఎక్కించాల్సి ఉండగా అధికారులు మీ సేవలకు ఆన్లైన్ సెంటర్లకు అప్పగించి కమిషన్లు తీసుకుంటున్నారని అన్నారు.
ఏఈవోలు తమకేం సంబంధం లేనట్టుగా అంత ఆన్లైన్ సెంటర్లో ఆన్లైన్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ తదితర సేవలను రైతులకు అందించాల్సి ఉండగా మండలంలో ఉన్నటువంటి ఏవో తమకేం సంబంధం లేదని అంటున్నారు. మండల వ్యవసాయ అధికారినిగా కనీస పర్యవేక్షణ చేయాల్సిన ఏవో చూస్తూ ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అన్నారు. వెంటనే ఏఈఓ, ఏవోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.