23-07-2025 05:29:05 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని అరూరు గ్రామానికి చెందిన నల్ల సాయిలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, మృతుడి కుటుంబానికి డీసీసీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి(DCC Vice President Vakiti Anantha Reddy) ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖా అధ్యక్షుడు బుర్ర నరసింహ, మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు, మత్స్యగిరిగుట్ట డైరెక్టర్ కోడితల కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, పోలపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు.