23-07-2025 05:41:37 PM
శ్రీశైలం డ్యామ్ 2 గేట్లు రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి సాగర్ దిగువకు నీటి విడుదల..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటోంది. జూరాల 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యామ్, జూరాల ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరద జలాలతో కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల పైగా నీరు వస్తుండటంతో అధికారులు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు మరొక గేట్‌ను 10 అడుగులు ఎత్తి మొత్తం రెండు గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 67 వేలకు పైగా క్యూసెక్కులు కాగా క్రస్ట్ గేట్ల ద్వారా 55 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మొత్తం సామర్థ్యం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215. 8070 సామర్ధ్య ఉండగా బుధవారం నాటికి 208.7210 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నట్లు అధికారులు ఆదివారం బుల్లెట్ ను విడుదల చేశారు. అధికారులు ఎగువ నుంచి వస్తున్న వరద జలాలను అంచనా వేస్తూ ఎగువ నుంచి ఫ్లడ్ పెరిగితే మరో క్రస్ట్ గేట్ ఎత్తే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుతం 573 అడుగులకు చేరుకుంది. అటు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 263 టీఎంసీలు నీరు నిల్వ ఉంది