23-07-2025 05:51:49 PM
కెమికల్ రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): దుండిగల్ మున్సిపల్(Dundigal Municipal) పరిధి దుండిగల్ తండా-2లో గల రాంకీ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో రాంకీ కంపెనీ పక్కనే నివాసం ఉంటున్న తండా వాసులు భయబ్రాంతులకు గురై ఇంటి నుండి బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనపై విద్యార్థి నాయకుడు రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. రాంకీలో వరుసగా మంటలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. తక్షణమే రాంకీ కంపెనీని తండా నుండి తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.