23-07-2025 05:55:02 PM
అడిషనల్ కలెక్టర్ రాంబాబు..
కోదాడ: మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు(District Additional Collector Rambabu) అన్నారు. బుధవారం 100 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా 8వ వార్డు బాలాజీ నగర్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలను తీసుకోవడం మాత్రమే కాకుండా, వాటిని బాధ్యతగా పరిరక్షించాలి.
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణాన్ని మెరుగుపర్చడంలో ప్రతి ఇంటి భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. మొక్కల పంపిణీ అనంతరం అదే ప్రాంతంలో గిరిజన సోదరులు జరుపుకునే ప్రత్యేక పండుగ అయిన తీజ్ ఉత్సవాల్లో అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అధికారులు భవాని, రాజయ్య, వార్డ్ ఆఫీసర్ శ్రీకాంత్, ఆర్పి దుర్గ, భూక్యా పాపా నాయక్, భూక్యా కోటి నాయక్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.