calender_icon.png 24 July, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వగ్రామంలో దాశరథి జయంతి

23-07-2025 12:00:00 AM

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో భారీ ర్యాలీ

మహబూబాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ప్రజాకవి దాశరథి కృష్ణమా చార్య జయంతి సందర్భంగా మంగళవారం ఆయన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘనం గా వేడుకలు నిర్వహిం చారు. భారీ ర్యాలీ నిర్వహించి, మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన దాశరథి విగ్రహానికి వివిధ పార్టీల ప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

పలువురు వక్తలు మాట్లాడు తూ.. నైజాం సర్కార్ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా 19 ఏళ్ల వయసులోనే కృష్ణమాచార్య రచనలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపారని కొనియాడారు. దాశరథి జన్మించిన చిన్నగూడూరు మండలానికి దాశరథి పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా మానుకోట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో దాశరథి జయంతిని ఘనంగా నిర్వహించారు.