01-05-2025 01:43:28 AM
మోర్తాడ్, ఏప్రిల్ 30: బుధవారం రోజు విడుదలైన ఎస్‌ఎస్సి పరీక్షల ఫలితాలలో మోర్తాడ్ మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 144 మంది విద్యార్థులకు గాను 143 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అలాగే మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మరియు కేజీబీవీ విద్యార్థులు 105 విద్యార్థులకు గాను 105 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగినది అలాగే ప్రైవేట్ పాఠశాల నవోదయ మరియు కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 115 విద్యార్థులకు గాను 115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మొత్తం మోర్తాడ్ మండలంలోని 364 విద్యార్థులకు గాను 363 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు ప్రభుత్వ పాఠశాల పరంగా 99% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
జడ్.పి.హె.ఎస్ సుంకేట్ విద్యార్థిని బండి అను శ్రీ 561 మార్కులు సాధించడం జరిగినది అలాగే మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మరియు కేజీబీ పాఠశాల నుండి 100% ఉత్తీర్ణత సాధించగా అందులో మహాత్మ జ్యోతిబాపూలే నుండి 577 మార్కులు మాలవత్ అరవింద్ సాధించడం జరిగినది అలాగే ప్రైవేట్ పాఠశాల నుండి 100% ఉత్తీర్ణత సాధించి నవోదయ పాఠశాల విద్యార్థి సిహె విగ్నేష్ 576 మార్కులు సాధించడం జరిగినది మొత్తం మోర్తాడ్ మండలంలో 500 పైన మార్కులు 183 మంది విద్యార్థులు సాధించడం జరిగినది ఇట్టి విద్యార్థులను శ్రీ మండల విద్యాశాఖ అధికారి శ్రీ సమ్మి రెడ్డి అభినందించడం జరిగినది.