calender_icon.png 2 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం

01-05-2025 01:43:00 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జాతీయ జనగణనలో కులగణనను చేర్చడం తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు సాధించిన విజయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచు తూ చట్టం చేసి పంపిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం బీసీలకు తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డి మాండ్  చేశారు. రాష్ట్రం లో కులగణనకు సహకరించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు సహచర మంత్రులకు, పార్టీ అగ్రనేత రా హుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆలస్యమైనా కులగణనపై కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందన్నారు.