calender_icon.png 21 November, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశ - దిశ లేని బడ్జెట్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

25-07-2024 07:40:47 PM

వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ దిశ లేని విధంగా ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా ఎన్నికల ముందు ఇస్తానన్నా మహిళలకు రూ.2500 మహాలక్ష్మి మాయమయ్యిందని, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా దూరమయ్యిందని, నిరుద్యోగులకు రూ.4 భృతి ఆశలేకుండా పోయిందని, రైతు కూలీల జాడలేదని, కౌలు రైతుల ఊసులేదన్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా రైతుబంధుకు రాం రాం, దళితబంధుకు జై భీంగా చేసారని నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్ ను ఇవాళ శాసన సభలో ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలకు సమయం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.