calender_icon.png 2 May, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లికార్జున, బీరప్ప ఉత్సవాలకు ఏర్పాట్లు

01-05-2025 01:04:01 AM

చేవెళ్ల , ఏప్రిల్ 30 : చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవునిఎర్రవల్లి వార్డులో ఈనెల (మే) 4,5వ తేదీల్లో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి, బీరప్ప జాతర  ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్, హైదరాబాద్  బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు సభ్యుడు సామ మాణిక్యరెడ్డి తెలిపారు. బుధవారం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై గ్రామస్తులతో కలిసి మాట్లాడి, ఆలయం వరకు ఉన్న రోడ్డులో చెత్త, పిచ్చి మొక్కలను తొలగింపజేశారు.

ఈ సందర్భంగా సామ మాణిక్యరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 11 సంవత్సరాలకు ఒక సారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జేసీబీతో రోడ్డును చదును చేయించి పిచ్చి మొక్కలను తొలగించిన దాత విజయ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నేతలు ఎదిరె శ్రీశైలం, ఎదిరె బక్కయ్య, అంగరెల్లి రాజు, ఎదిరె యాదయ్య, కరికె విఠలయ్య పాల్గొన్నారు