టెన్త్‌లో బాలికలదే పైచేయి
పది ఫలితాల్లో రాష్ట్రంలో నిర్మల్ జిల్లాకు మూడోస్థానం
మంచిర్యాల జిల్లాలో 132 పాఠశాలల్లో ౧౦౦% పాస్
ప్రభుత్వ 81, ప్రైవేటు 51 పాఠశాలల్లో 100 ఉత్తీర్ణత
కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యార్థుల మార్కులు
నిర్మల్/మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోని మూడో స్థానంలో నిలిచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు వెల్లడించగా నిర్మల్ జిల్లా 98.56 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 9743 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9642 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
అందులో 4711 బాలురు 4931 బాలికలు ఉన్నట్టు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు సోఫినార్ గురుకుల పాఠశాల ఆదర్శ మోడల్ స్కూ ల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాల లో 98% పైగా ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. గత ఏడాది నిర్మల్ జిల్లా 13వ స్థానంలో నిలువగా ఈసారి ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల ప్రత్యేక ప్రణాళికతో మెరుగైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు.
నిర్మల్ కలెక్టర్ అభినందన..
పదవ తరగతి ఫలితాలు నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ జిల్లాలో మంచి ఫలితాలను తీసుకొచ్చారని ఇదే స్ఫూర్తితో రాబోయే విద్యా సంవత్సరం పదో తరగతిలో నిర్మల్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని తెలిపారు. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందకుండా సప్లమెంటరీలో పరీక్ష రాసి విధంగా విద్యాశాఖ వారికి మనోధయం కల్పించాలని సూచించారు.
గురుకుల విద్యార్థుల ప్రతిభ...
నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ జనరల్ గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలోని అత్యుత్తమ వరకు సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. పాఠ శాలలో 100% ఫలితాలు రాగా గాయత్రికి 600 మార్కులకుగాను 585 మార్కులు వచ్చాయన్నారు. రోహితకు 584, వైష్ణవికి 582, అర్చనకు 57 7, దివ్య , సాహస, సిరి ముగ్గురు విద్యార్థులకు 576 మార్కులు వచ్చినట్టు తెలిపారు. విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ అభినందించారు.
శాంతినికేతన్ ప్రభంజనం
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన డి శ్రీనిధి 568, రాజేశ్వరి 564, హర్షవర్ధన్ 558, శ్రీ నిత్య556, శ్రీ రాగ్ని,554 జాహ్నవి 553, సాత్విక 552, మార్కులు సాధించినట్లు వారు వెల్లడించారు. మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఆయన అభినందించి సన్మానం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దిట్టుగా మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు
కలెక్టర్ కార్యాలయంలో సంబరాలు
నిర్మల్ జిల్లా10వ తరగతి ఫలితాల్లో మూడో స్థానం దక్కించుకోవడంతో విద్యా శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్లు వెంకటేశ్వర్లు కిషోర్ కుమార్ బైంసా సబ్ కలెక్టర్ సాయి సాకేత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.
మంచిర్యాల జిల్లాలో 132 పాఠశాలల్లో వంద శాతం పాస్
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పది వార్షిక పరీక్షా ఫలితాల్లో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో 97.20 శాతంతో 20వ స్థానంలో నిలువగా గత ఏడాదితో పోల్చితే మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ ఏడాది 9,684 మంది (4,879 బాలురు, 4,805 బాలికలు) విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,413 మంది (4,720 బాలురు, 4,693 బాలికలు) ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని 243 (167 ప్రభుత్వ, 76 ప్రైవేటు) పాఠశాలల్లో 132 (81 ప్రభుత్వ, 51 ప్రైవేటు) పాఠశాలల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించారు.
ఫలించిన జిల్లా బాస్ ప్రత్యేక దృష్టి
మంచిర్యాల జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వసతుల కల్పనతో పాటు ర్యాంకుల సాధనలో ప్రభుత్వ విద్యా సంస్థలు పోటీపడి విజయం సాధించాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శిస్తూ వారికి కల్పిస్తున్న వసతులను పరిశీలించడమే కాకుండా పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిక్షిస్తూ ఉపాధ్యాయులను, వసతిగృహాల అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. జిల్లా విద్యాధికారి యాదయ్యను ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని తెలుసుకుంటూ ముందుకు సాగారు. మంచి ఫలితాలు సాధనకు తనవంతు కృషి చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ మండలానికి వెళ్లినా తప్పని సరిగా అక్కడి ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించని రోజంటూ లేదనేది జగమెరిగిన సత్యం.
కార్పొరేటుకు ధీటుగా.. సర్కార్ విద్యార్థులు ప్రతిభ
మంచిర్యాల జిల్లాలోని 243 పాఠశాలల్లో 76 కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ఉండగా 167 ప్రభుత్వ విద్యాసంస్థలున్నాయి. 76 ప్రైవేటు పాఠశాలల్లో 51 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో ఒక పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా 13 జీఏహెచ్‌ఎస్ లలో ఆరు, ఏడు జీహెచ్‌ఎస్ లలో ఒకటి, 18 కేజీబీవీలలో 11, 101 లోకల్ బాడీ ల్లో 45, ఎనిమిది ఎంజేపీలలో ఏడు, మూడు టీఎంఆర్‌ఎస్ లలో రెండు, ఒక టీజీఆర్‌ఎస్, తొమ్మిది టీజీడబ్ల్యూఆర్‌ఎస్ లలో ఏడు విద్యా సంస్థలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.
మేనేజ్ మెంటుల వారిగా మార్కులను పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల విభాగంలో 595 మార్కులు అత్యధికం కాగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మోడల్ స్కూళ్లలో 586 మార్కులు అత్యధికం. అలాగే ఎంజేపీ ల్లో 585, లోకల్ బాడీ పాఠశాలల్లో 582, కేజీబీవీల్లో 576, టీజీడబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలల్లో 574, టీఎంఆ ర్‌ఎస్ లో 570, జీహెచ్‌ఎస్ లో 563, టీజీఆర్‌ఎస్ ల్లో 561, ఏయిడెడ్ పాఠశాలల్లో 555 మార్కులు, జీఏహెచ్‌ఎస్ లో 545 మార్కులు ఆయా మేనేజ్ మెంటుల వారిగా టాప్ మార్కులుగా జిల్లా విద్యాశాఖాధికారి యాద య్య వెల్లడించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 94.16% ఉత్తీర్ణత
జిల్లాలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6932 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 6527 మంది ఉత్తీర్ణత సాధించి 94.16 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. బాలురలో 3213 మంది హాజరై 2949 మంది (91.78%) ఉత్తీర్ణత సాధించగా, బాలికల్లో 3719 మంది హాజరై 3578 మంది (96.21%) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించడం విశేషంగా నిలిచింది.
జిల్లాలోని మొత్తం 170 పాఠశాలలలో 54 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. మహాత్మ జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల లో 59 మందికి 59 మంది విద్యార్థినిలు ఉత్తీర్ణత సాధించడంతో 100% లో నిలిచింది. స్వాతిక 562, కీర్తన 561, లక్ష్మి557 మార్కులు సాధించారు. తెలంగాణ మోడల్ స్కూల్స్లో 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 96 మంది ఉత్తీర్ణత సాధించారు. పలు పాఠశాలల్లో 90 శాతం పైగా ఉత్తీర్ణత నమోదు కాగా, కొన్ని పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. విద్యార్థులకు అదనపు బోధన అందించడంతో ఫలితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు.






