01-01-2026 01:23:50 AM
నిర్మల్‌కు రైల్వేలైన్ నిర్మాణంపై ఆశలు
ప్రత్యేకత నిలువనున్న గోదావరి పుష్కరాలు
విద్యా ప్రమాణాలకుపై అధికారుల దృష్టి
నిర్మల్, డిసెంబర్31 (విజయక్రాంతి): 2025 సంవత్సరాలకి వేడుకలు పలుకుతూ 2026 సంవత్సరంలోకి అడుగు పడుతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో కొత్త సంవత్సరం లో కోటి ఆశలు నెరవేరాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2025 మధుర జ్ఞాపకాలను కాల గర్భంలో కలిసిపోగా 2026 అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని రంగాల్లో చైతన్య ఉన్నా నిర్మల్ జిల్లాలో 2026లో ప్రజలు కోరుకున్న సుపరిపాలన శాంతి భద్రత పర్యవేక్షణ పారదర్శక పాలన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు పాడిపంటలు వృద్ధి చెంది ప్రజల ఆర్థిక మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రధాన అంశాలు సమస్యలపై ప్రత్యేకత కథనాలు..
రైల్వే నిర్మాణంపై ఆశలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్‌కు రైల్వే లైన్ నిర్మాణంపై 2026లో అడుగుపడాలని కోరుతున్నారు. ఆర్మూర్ నిర్మ ల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. రైల్వే లైన్ నిర్మాణంపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమి త్ షా, బిజెపి నేతలు మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో డిపిఆర్‌లు రూపొందించి బడ్జెట్లో నిధులు కేటాయిస్తే నిర్మల్ ఆర్మూర్ 110 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తయితే నిర్మల్ జిల్లా వాసులకు రైలు కనెక్టివిటీ పెరిగి వాణిజ్య వ్యాపార పరం గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది అవకాశముంది ఆ దిశగా ఈ సంవత్సరం కలిసి రావాలని కోరుతున్నారు.
గోదావరి పుష్కరాలు
2026లో గోదావరి పుష్కరాలు రానున్నా యి. 12 సంవత్సరాలకు ఓసారి జరిగే గోదావ రి పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. 2014లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పుష్కరాలను నిర్వహించగా రాష్ట్రంలో అధికారులు ఉన్న ప్రజాపాలన ప్రభుత్వం ఈ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని బాసర, సోన్ మాదాపూ ర్, కూచనపల్లి, ఖానాపూర్ తదితర ప్రాంతా ల్లో ఈ పుష్కరాలు పుష్కర్ ఘాట్‌ల వద్ద పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగే అవకాశం ఉంది . పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహించి ప్రజలకు లాకు పుణ్యం దక్కాలని కోరుతున్నారు.
విద్య ప్రమాణాల పెంపుపై ఆశలు
నిర్మల్ జిల్లాలో ఈ సంవత్సరంలో విద్యా ప్రమాణాలు పెరిగి ఉద్యోగ అవకాశాలు దక్కాలని ఆకాంక్షిస్తున్నారు పదో తరగతి ఫలితాల్లో ఇప్పటికి రెండుసార్లు రాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచిన నిర్మల్ జిల్లా ఈ విద్యా సంవత్సరం కూడా మొదటి స్థానం దక్కించాలని అధికారులు పట్టుబట్టి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నారు జిల్లాకు ఎన్నో సంవత్సరాలు కోరుకుంటున్న ఇంటిగ్రేటెడ్ విద్య సంస్థతోపాటు నవోదయ విద్యాసంస్థ నిర్మల్ లో పీజీ కళాశాల తిరిగి ప్రారంభమై జిల్లా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.
రైతులకు కలిసి రావాలి..
నిర్మల్ జిల్లాలో 70 శాతం వ్యవసాయ రం గంపై ఆధారపడి ఉన్న రైతన్నకు ఈ సంవత్సరం కాలం కలిసి రావాలని ప్రజలు కోరు కుంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు చెరువులు భూగర్భ జలాలు పెరిగి పాడి పంటలు బాగా పండిన పంటలకు గిట్టుబాటు ధర ఉండాలని కోరుతున్నారు. గత సంవత్సరం రైతులకు అధిక వర్షాలు ఆపై వరదలు పంటలకు తీవ్ర నష్టం జరగడంతో రైతులు ఇబ్బందికి గురైన సంగతి తెలిసింది. సకాలంలో వర్షాలు కురిసి వేసిన పంటలు బాగా పెరిగి పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారు. జిల్లాలో 4:20 లక్షల ఎకరాలు వివిధ పంట లు సాగు చేస్తున్న విషయం తెలిసిందే.
నేరాల నియంత్రణ
నిర్మల్ జిల్లాలో కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ తగ్గుముఖం పట్టాలని కోరుతున్నారు. 2025లో జిల్లాలో ప్రమాదం జరిగి 150 మంది మృత్యువాత పడ్డారు. ఆర్థిక నేరాల సైబర్ నేరాలు దొంగతనాలు ఇతర నేరాలు తగ్గాలని ఆకాంక్షిస్తున్నారు. జిల్లా పోలీస్ శాఖ నేరాల నియం త్రణకు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
పారదర్శకమైన పాలన
నిర్మల్ జిల్లాలో 2026 సంవత్సరంలో ప్రజలకు పారదర్శకమైన పాలన అంది ప్రభు త్వ సంక్షేమ పథకాలు ప్రజలకు దక్కాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడు గూడు గుడ్డ చదువు ఆరోగ్యం వంటి మౌలిక సంక్షేమ పథకాలు నిరుపేదలైన ప్రతి ఒక్కరికి దక్కినప్పుడే వారు సామాజికంగా ఆర్థికంగా ముందుకు వెళ్లి అవకాశం ఉంది. ఆ దిశగా పాలకులు కృషి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రజా ప్రతినిధిలో మార్పు రావాలి
2026 సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో కీలకమైన ఎన్నికలు రాను నేపథ్యంలో ప్రజలకు సేవ చేసే నాయకులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాలో నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు 18 మండ ల పరిధిలో ఎంపీటీసీ జెడ్పిటిసి జెడ్పి చైర్మన్ ఎన్నికల తో పాటు సహకార సంఘాల ఎన్నిక లు నీటి సంఘాల ఎన్నికలు జరగనుండే పత్రికల్లో ఎన్నికల్లో ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసే ప్రజా నాయకులు విజయం సాధించి ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాశిస్తున్నారు
పారదర్శకమైన పాలనపై దృష్టి
2025కు వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరంలో కొత్త కొత్త ఆశలతో పారదర్శకమైన పాలన అందించడంపై దృష్టి సారించాం. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల అభివృద్ధి ఆకాంక్షించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిం చడమే కాకుండా ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు విద్య వైద్యం రవా ణా వ్యవసాయం పారదర్శకమైన పాలన అందించే విధంగా ప్రత్యేక కార్యాలయం ముందుకు వెళ్తున్నాం.
అభిలాష అభినవ్, కలెక్టర్
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో శాంతి బత్తుల పర్యవేక్షణ నేరాలు నియం త్రణ సైబర్ నేరాలు తగ్గింపు మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి అంశాలపై ఈ ఏడాదిలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. 2025లో పోలీస్ శాఖ ప్రజలతో మమేకమయ్యేందుకు పోలీస్ అక్క మహిళా శివాంగి దళంతో మంచి పేరు వచ్చింది ఇటువంటి వినూత్న కార్యక్రమాలతో పోలీస్ శాఖ జిల్లాలో మార్పు కోరుకుంటూ ప్రజల రక్షణ కృషి చేస్తుంది.
జానకి షర్మిల, జిల్లా ఎస్పీ