01-01-2026 01:23:19 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
టీజీవో అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం, డిసెంబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో క్యాంపు కార్యాలయం లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీజీవో జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రిలకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు గెజిటెడ్, అధికారులకు, ఉద్యోగులకు నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాప్ర భుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించడంలో ముందుంటుందని తెలి యజేశారు. కార్యక్రమంలో కేంద్ర కార్యవర్గ సభ్యు లు కొండపల్లి శేషు ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు గంగవరపు నరేం దర్, మల్లెల రవీంద్ర ప్రసాద్, ట్రెజరర్ సూరంపల్లి రాంబాబు, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, మహిళ అధ్యక్ష కార్యదర్శులు జి ఉషశ్రీ, సుధారాణి, జిల్లా కార్య వర్గ సభ్యులు జీ రమేష్, కనపర్తి వెంకటేశ్వర్లు, బి.హరీష్, బి కృష్ణ, కరుణశ్రీ, ఎం సతీష్, బి రాంబాబు, జై పుష్పరాజు, వై మంజుల, బి బాలాజీ, కే విజయలక్ష్మి, ఎం గోపాలకృష్ణ, గౌస్ పాష, బి శంకర్, డి అరుణ కుమారి, బి శారద, ఎస్ భాస్కర్, గుమ్మడి మల్లయ్య, తమ్మిశెట్టి శ్రీనివాస్, ఎండి తాజుద్దీన్, కేజీబీవీ ప్రసాద్, మోదుగ వెంకటేశ్వర్లు, జె చిరంజీవి, డిగ్రీ కళాశాల అధ్యాపక సంఘం బూరుగు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి నవీన జ్యోతి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రంథాలయ సంఘ బా ధ్యులు ప్రసాద్ బాబు, ఫణి కుమార్ మో హన్, కోపరేటివ్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు ఏడుకొండలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కరుణాశ్రీ, అరుణ కుమారి, జూనియర్ కళాశాల సంఘం బా ధ్యులు తిరుపతిరా వు, నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు