26-08-2025 06:03:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర హస్తకళల చైర్మన్ సత్యనారాయణ ను మంగళవారం కలిసి నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ మండల కేంద్రంలో హస్త కళల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు సమత సుదర్శన్ తెలిపారు. సమతా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున కేంద్రం ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉపాధి దొరుకుతుందని ఆయన విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుగుణ శ్రీకాంత్ రెడ్డి పార్టీ నేతలు ఉన్నారు.