calender_icon.png 26 August, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

26-08-2025 06:07:40 PM

హనుమకొండ.(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలలో భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన భూభారతి దరఖాస్తులను వేగవంతంగా  పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ, ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా భూభారతి దరఖాస్తులు ఎన్ని వచ్చాయని, అందులో ఎన్నిటిని ఆమోదించారని, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణ అయ్యాయని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

వచ్చిన దరఖాస్తులలో ఏఏ కారణాల చేత తిరస్కరణ అయ్యాయని,తిరస్కరణ అయిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయాలని, ఏయే ఆధారాలతో భూమిపై ఉన్నారనే వివరాలను విచారించాలన్నారు. భూభారతి దరఖాస్తుల  పరిష్కార చర్యలను మరింత వేగవంతం చేయాలని, ప్రతిరోజు పురోగతి ఉండాలన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో మాట్లాడి వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.