26-08-2025 07:11:09 PM
హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల(Telangana Panchayat Elections) నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
1. ఈనెల 28వ తేదీలోపు గ్రామపంచాయతీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల ప్రకటన.
2. ఈ నెల 29న జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులపై సమావేశం.
3. ఈ నెల 30న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలతో మీటింగ్.
4. ఈ నెల 30న తొలగింపు, అబ్జెక్షన్లపై వివరాలను తీసుకోనున్న ఎన్నికల కమిషన్.
5. ఈ నెల 31న అభ్యంతరాలను తొలగించడం.
6. వచ్చే నెల 2న గ్రామపంచాయతీలో వారిగా ఫోటోతో కూడిన ఓటర్ల లిస్టును ప్రకటించనున్న ఎన్నికల కమిషన్.