27-07-2025 07:41:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): అవినీతి నిర్మూలన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి అలోక్ రవీంద్రను ఆదివారం కలిసినట్టు తెలంగాణ సమాచార హక్కు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హైదర్ తెలిపారు. అవినీతి వ్యతిరేకంగా జాతీయ కమిషన్ చేసిన కృషిలో తాము కూడా సహకారం అందిస్తామని ఆయనకు తెలిపినట్టు హైదర్ వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నాయకులు వినోద్ సాదిక్ శ్రీనివాస్ తదితరులున్నారు.