27-07-2025 07:46:35 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar District) 15వ డివిజన్ మార్కండేయ నగర్, రాంనగర్, ప్రగతి నగర్, సప్తగిరి కాలనీ, శివనగర్ సంబంధించిన పద్మశాలి సంఘం ఎన్నికలను మార్కండేయ సాయిబాబా ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. అధ్యక్ష పదవికి తెల్ల రమేష్, మంచికట్ల కిషోర్ పోటీ చేయగా తెల్ల రమేష్ కు ఓట్లు 101, మంచి కట్ల కిషోర్ కు పడ్డా ఓట్లు 71 గాను, 30 ఓట్ల మెజార్టీతో తెల్ల రమేష్ నూతన పద్మశాలి సంఘం అధ్యక్షులుగా గెలుపొందడం జరిగింది.
మిగతా పదవులకు గాను పోటీలో ఎవరు చేయకపోయేసరికి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షులుగా వేముల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా చెరుకు మధుగ, సహాయ కార్యదర్శిగా దూస రాజశేఖర్, కోశాధికారిగా కె శ్రీనివాస్ ఎన్నిక అయ్యారు. అనంతరం గౌరవ అధ్యక్షులు చిన్నం రాజేశం 15వ డివిజన్ పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి వొడ్నాల రాజు, బూర్ల ప్రకాష్, వాసం సత్యనారాయణ, ఆడేపు సత్యనారాయణ రిటైర్డ్ ఎంపిడిఓ, తేల శ్రీనివాస్, గాలి సుధాకర్, వేముల వెంకటేశం, గాజర్ల పెంటప్ప, అడిగొప్పుల కనకయ్య, మంచే శ్రీధర్, గాలి రాజయ్య, తేల్ల మధు, అడిగొప్పుల రాజు, అడిగొప్పుల శ్రీనివాస్, నక్క కిరణ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.