27-07-2025 07:39:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కొండాపూర్ శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి(APJ Abdul Kalam Death Anniversary) వేడుకలను కలాం గుణం ఎడ్యుకేషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సుమలత నిర్వాకులు అజారుద్దీన్ అజీమ్ పాల్గొన్నారు.