శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర మహిళా రాజకీయ విభాగ్ చైర్మన్‌గా మోరిశెట్టి నివేదిత లక్ష్యాది
సూర్యాపేట, జూన్ 21 (విజయక్రాంతి): శ్రీ వాసవి సేవా సమితి రాష్ట్ర మహిళా రాజకీయ కమిటీ చైర్మన్ గా సూర్యాపేట మునిసిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్ పర్సన్ నివాసములో శ్రీ వాసవి సేవాసమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించినందుకు పూరి సురేష్ శెట్టి కి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ వాసవి సేవాసమితి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం ప్రధాన కార్యదర్శి దేవర్శెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ గౌరవ సలహాదారులు గోపారపు రాజు సబ్యులు గుండా వెంకన్న(సుమన్) తదితరులు పాల్గొన్నారు.






