22 June, 2026 | 3:00 AM

గొప్ప విజయాలు సాధించాలంటే సూత్రాలు పాటించాలి

22-06-2026 12:00 AM

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

కోదాడ, జాన్ 21: విద్యార్థులు గొప్ప విజయాలు సాధించాలంటే సూత్రాలు పాటిం చాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం కోదాడ ప బ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కతరం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కతరం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞ దంపతులు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందిస్తున్న కతరం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ ల పంపిణీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు ప్రతిభావంతులుగా మారాలంటే 6 పేజీల పాఠ్యాంశాన్ని మూడు పేజీల్లోకి రాయాలని అంటే సారాంశాన్ని గ్రహించాలని చెప్పారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఒకప్పుడు కోదాడ పట్టణంలో పాఠశాల ఫీజు చెల్లించలేక ఇబ్బం దులు పడ్డానని, తన మాదిరిగా ప్రతిభ కలిగి ఆర్థికంగా లేని విద్యార్థులు ఇబ్బందులు వద్దనీ ప్రేరణ కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నామన్నారు. విద్యా, వైద్యం, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల సాధనకు ప్రోత్సహం ఇవ్వడమే లక్ష్యం అన్నారు.

కోదాడ నియోజక వర్గం నుండి 1000 మంది డాక్టర్లు, ఇంజనీర్ల ను తయారు చేయడమే ఫౌండేషన్ లక్ష్యం అన్నారు.పదో తరగతి 2026 వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 39 మంది విద్యార్థులకు రూ.4 లక్షల 20 వేల రూపాయల స్కాలర్ షిప్ అందజేశారు .అందులో భాగంగా మండల స్థాయి ర్యాంకర్లకు 37మందికి రూ.10వేలు, నియోజకవర్గస్థాయి ర్యాంకర్లకు రూ.25వేల స్కాలర్ షిప్ లు అందేశారు. అనంతరం మాజీ జేడి విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు.

రిటైర్డ్ హెచ్ ఎమ్ ముత్తవరపు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కత్రం సీతారామి రెడ్డి, పోటు రంగారావు, ఎంఇఓ లు సలీం షరీఫ్, తల్లడా శ్రీనివాస్, న్యాయ వాది దేవబతిని నాగార్జున,పీ ఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహా రావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బంధం వెంకటేశ్వర్లు, బడుగుల సైదులు,కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కత్రం కిరణ్ రెడ్డి, ముత్తవరపు రామారావు, ముడియాల సత్యనారాయణ రెడ్డి, బుడిగ రామాంజనేయులు విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.