calender_icon.png 16 October, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అలసత్వం వద్దు

15-10-2025 12:00:00 AM

మానిటరింగ్ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ సూచన

ఆదిలాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ ట్రే సిటీ పెండింగ్ కేసులపై యలసత్వం కేసులకు సంబంధించిన వాటిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల పురోగతిపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి పర్యవేక్షించే  విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంl కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం  నిర్వహించారు.

శాసన సభ్యు లు పాయల్ శంకర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించారు. సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించిన నిధుల వినియోగం, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరించాల్సిన పారదర్శకత పై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా  చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలని కమిటి సభ్యులకు సూచించారు.

కమిటీ సభ్యులు వారి సూచనలు, అభిప్రాయాలను వ్యక్తపరిచారు., ఎస్సీ ఎస్టీ లపై అన్యాయాల నివారణకు తీసుకొచ్చిన చట్టాలు ఎన్ని ఉన్న దాడులు జరుగుతూనే ఉన్నాయని కమిటి సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పరిహారంగా బాధితులకు రూ.25 వేలు చెల్లించడం జరుగు తుందన్నారు.  కేసుల అమలులో పారదర్శకత, పర్యవేక్షణ, సమర్థత కోసం జిల్లా స్థాయి విజిలెన్స్,  మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడుల పై చర్యలను నివారించేందుకు, బాధితులకు న్యాయం జరిగేందుకు కమిటీ కీలకంగా పనిచేస్తుందనీ తెలిపారు. చట్టాల అమలును పర్యవేక్షిస్తూ బాధితులకు సకాలంలో పరిహారం, న్యాయం అందేలా చూస్తుందని, సభ్యులు తమ బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని కలెక్టర్  సూచించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లు శ్యామలాదేవి, రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్ సింగ్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ట్రైనీ డిప్యూటి కలెక్టర్  వంశీ కృష్ణ రెడ్డి, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, డీఎస్పీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.