calender_icon.png 17 October, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక

15-10-2025 12:00:00 AM

16 నుంచి జిల్లాలో ఎంపిక ప్రక్రియ

ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్

మంచిర్యాల, అక్టోబర్ 14 (విజయక్రాం తి) : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు జరుగుతున్న సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. మంగళ వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీసీసీ అభ్యర్థి ఎంపిక కార్యాచరణను వివరించారు.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నామని, ఇందుకోసం జిల్లాపై పట్టున్న, నాయకుల, కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న, అందరిని కలుపు కుపోయే వ్యక్తిత్వమున్న, పార్టీ అభివృద్ది కోసం పాటుపడే నాయకుడిని ఎంపిక చేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వంశీ చందర్‌ల ఆదేశాలతో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పీసీసీ కో ఆర్డినేటర్లు శివలింగ్ శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతిలతో కలిసి నిర్వహిస్తామన్నారు.

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. నాలుగు గంటలకు పాత్రికేయుల సమావేశం, ఐదు గంటలకు జిల్లా స్థాయి నాయకులతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించి డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు ఫారాలు అందజేస్తామన్నారు. 

పార్టీ లైన్ ప్రకారం బలమైన, పార్టీ కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకుంటామన్నా రు. 17న ఉదయం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసిన అభ్యర్థులతో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో వన్ టూ వన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటలకు బెల్లంపల్లి నియోజక వర్గ స్థాయి సమావేశంలె బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేయనున్నామన్నారు.

18న చెన్నూర్ అసెంబ్లీ నియోజక వర్గ సమావేశం ఉదయం 11 గంటలకు చెన్నూర్ లో ఉంటుందని, 19న ఉద యం పది గంటలకు డీసీసీ అధ్యక్షుడిగా దరఖాస్తు చేసుకున్న వారితో ముఖాముఖి నిర్వ హిస్తామన్నారు. అంతే కాకుండా అధ్యక్షుడి ఎంపిక కోసం మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తల వద్దకు వెళ్లి వారి ఒపినియన్ తీసుకుంటామన్నారు.

దరఖాస్తు చేసు కున్న వారిలో నుంచి ఆరుగురిని ఎంపిక చేసి అధిష్టానంకు దరఖాస్తు ఫారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో తనతోపాటు పీసీసీ కో ఆర్డినేటర్లు శివలింగ్ శ్రీనివాస్ గౌడ్, అనిల్ కుమార్, జ్యోతిలు ఉంటారన్నారు. సంఘఠన్ సృజన్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో భాగంగా మంగళ వారం హైదరాబాద్ లో ఎంఎల్‌ఏలు గడ్డం వివేక్ వెంకట స్వామి (చెన్నూర్), గడ్డం వినోద్ (బెల్లంపల్లి)లతో పాటు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావుతో పాటు డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను కలిసి కార్యక్రమ షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ వెల్లడించారు.